News29th Mar 08:50 AMSunil Byrisetty1 min read
మే 1 నుంచి బ్యాంకు ఛార్జీల మోత!
మే నెల నుంచి బ్యాంకు చార్జీల మోత మోగనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పై మే 1 నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్బీఐ ఇంటర్చేంజ్ ఫీజు పెంచడానికి అనుమతించడంతో ఉచిత పరిమితి మించితే లావాదేవ
మే నెల నుంచి బ్యాంకు చార్జీల మోత మోగనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ పై మే 1 నుంచి ఛార్జీలు పెరగనున్నాయి.
ఆర్బీఐ ఇంటర్చేంజ్ ఫీజు పెంచడానికి అనుమతించడంతో ఉచిత పరిమితి మించితే లావాదేవీకి రూ.2, బ్యాలెన్స్ విచారణకు రూ.1 అదనంగా చెల్లించాలి.
దీంతో ఏటీఎం నుంచి పరిమిత సంఖ్యకు మించి నగదు తీసుకున్నప్పుడు ఒక్కో లావాదేవీకి రూ.19, బ్యాలెన్స్ చెకింగ్‌కు రూ.7 చెల్లించాల్సి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
డబ్బులు విత్‌డ్రా చేయడానికి అదే బ్యాంక్ అయితే రూ. 5 విత్‌డ్రా చార్జీలు పడనునన్నాయి.. వేరే బ్యాంక్ అయితే మెట్రో నగరాల్లో రూ. 5, ఇతర ప్రాంతాల్లో 3 విత్‌డ్రా లిమిట్‌గా ఉంది.
ఈ పరిమితి దాటితే ఒక్కో విత్‌డ్రాపై రూ. 23 ఛార్జ్ చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతినిచ్చింది.
ఈ పెరిగిన చార్జీలు మే 1 నుంచి అమలు కానున్నాయి.