News2nd May 03:19 PMSunil Byrisetty1 min read
మతం మారితే కులం వర్తించదన్న హైకోర్ట్
ఏపీ హైకోర్ట్ మతం మారడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మతం మారితే కులం వర్తించదని స్పష్టం చేసింది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి
ఏపీ హైకోర్ట్ మతం మారడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
మతం మారితే కులం వర్తించదని స్పష్టం చేసింది.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఓ వివాదంలో ఆయన పలువురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.
అయితే మతం మారిన ఎస్సీ వ్యక్తికి హిందూ మతంలో ఉన్న కులం వర్తించదని లాయర్ ఫణిదత్ వాదించారు.
రాజ్యాంగం ప్రకారం హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారిన వారికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని హైకోర్టు కూడా ఏకీభవించింది.
దీంతో అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని కోర్టు తీర్పును ఇచ్చింది.