National6th Oct 01:27 PMSunil Byrisetty1 min read
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై చెప్పు దాడికి యత్నం
సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ లాయర్ దాడికి యత్నించారు. కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డు
సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ లాయర్ దాడికి యత్నించారు. కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని ఆయనను బయటికి లాక్కెళ్లారు. ఈక్రమంలో ఆయన 'సనాతన ధర్మాన్ని కించపరిచేవారిని వదిలిపెట్టం' అని బిగ్గరగా అరిచారు. దీనిపై CJI స్పందిస్తూ 'మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించండి. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు' అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.