News13th Mar 10:25 AMSunil Byrisetty1 min read
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అక్రమాలపై విజి‘లెన్స్’
ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అం
ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అందిన సమాచారం ప్రకారం రూ. 20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన రూ. 25 లక్షలను ఖర్చు చేసిన విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అందిందన్నారు.
అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు.
రిజిస్ట్రార్‌తో సహా ఇల్లీగల్ అపాయింట్ మెంట్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల నిర్వహణలో ప్రైవేటు కళాశాలల నుంచి లంచాలు తీసుకోవడం, విశ్రాంత ప్రొఫెసర్లు, ప్రిన్సిపాళ్లను నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగించడం వంటి తీవ్రమైన అభియోగాలు నాటి వైస్ ఛాన్సలర్ పై వచ్చాయని వివరించారు.
దీనిపై ఇన్‌చార్జి వీసీతో ఒక కమిటీని నియమించి, అవకతవకలపై నివేదిక కోరామన్నారు.
60 రోజుల్లోనే ఎంక్వయిరీ పూర్తిచేసి, నివేదికను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశిస్తున్నామని చెప్పారు.
రిపోర్టు వచ్చిన వెంటనే వర్సిటీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.
మరోసారి పొరపాటు చేయాలంటే భయపడేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు.