Entertainment1st Aug 11:49 AMSunil Byrisetty1 min read
ప్రేక్షకులకు పండుగే.. ఆగస్టు హీరో ఎవరో!
ఆగస్ట్ నెల వస్తూ వస్తూ కొత్త సినిమాల విడుదలను తెచ్చేసింది. ఈ నెలంతా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. కేజీఎఫ్-2తో బాక్సీఫీసును షేక్ చేసిన యష్ టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు
ఆగస్ట్ నెల వస్తూ వస్తూ కొత్త సినిమాల విడుదలను తెచ్చేసింది. ఈ నెలంతా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. కేజీఎఫ్-2తో బాక్సీఫీసును షేక్ చేసిన యష్ టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ చివరి వారంలో థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో నయనతార, కియరా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా హీరోయిన్లు కావడం విశేషం. భారీ అంచనాలతో వస్తున్న మరో సినిమా విశ్వనాధ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన తమిళ సినిమా ఇది. తెలుగులో ఆగస్టు 15కి విడుదల చేయబోతున్నారు. ఈ నెల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న మరో సినిమా ఇరుముడి. ఫ్లాపులతో గ్రాఫ్ పడిపోతున్న రవితేజ, తన స్టార్ డమ్ ను నిలబెట్టుకునేందుకు చేస్తున్నామని చెప్పిన సినిమా. 21న రిలీజయ్యే ఈ సినిమాలో అయ్యప్ప భక్తుడిగా రవితేజ కనిపిస్తున్నారు. వీటితోతో పాటు వరుణ్ తేజ్ నటించి కొరియన్ కనకరాజు, దుల్కర్ సల్మాన్ చిత్రం ఐయామ్ గేమ్ సినిమాలు కూడా ఈ నెలలోనే థియేటర్లలో పలకరించనున్నాయి.