News4th Nov 05:18 PMSunil Byrisetty1 min read

కొల్లేరు సరస్సు అభివృద్ధి కోసం అథారిటీ ఏర్పాటు

కొల్లేరు వన్యప్రాణి సంరక్షణా ప్రాంతం,సరస్సును సుస్థిరంగా అభివృద్ధి చేయడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అథారిటీ ముఖ్యంగా

కొల్లేరు సరస్సు అభివృద్ధి కోసం అథారిటీ ఏర్పాటు
కొల్లేరు వన్యప్రాణి సంరక్షణా ప్రాంతం,సరస్సును సుస్థిరంగా అభివృద్ధి చేయడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అథారిటీ ముఖ్యంగా కొల్లేరు సరస్సు పరిరక్షణ, అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించడం, పర్యావరణ కాలుష్యం నియంత్రణ, నీటి నాణ్యత మెరుగుదలపై దృష్టి సారించాలి. చేపల వైవిధ్యం రక్షణ, సుస్థిర మత్స్యాభివృద్ధి, పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయ అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. జీవ వైవిధ్యం సంరక్షణ, ఆక్రమించే జాతుల నియంత్రణ, సిల్టేషన్‌ నియంత్రణ, నీటి ప్రవాహ వ్యవస్థ పునరుద్ధరణ, ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరిపి పురోగతి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అథారిటీలో సభ్యులు అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడుగా పర్యావరణ, అరణ్య, విజ్ఞాన & సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా రెవెన్యూ, ఫిషరీస్, వ్యవసాయం, పంచాయతీ రాజ్, వాటర్ రిసోర్సెస్, టూరిజం, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా కలెక్టర్లు (ఏలూరు, భీమవరం, మచిలీపట్నం), బయోడైవర్సిటీ బోర్డు, WII డెహ్రాడూన్ సైంటిస్ట్ ఉంటారు.
Andhra Pradesh
Kolleru Lake
Wildlife Sanctuary
Environmental Protection
Sustainable Development
Biodiversity
జీవ వైవిధ్యం
పర్యాటక అభివృద్ధి
మత్స్య అభివృద్ధి
నీటి సంరక్షణ
Scroll for the next article