News4th Oct 01:52 PMSunil Byrisetty1 min read

ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటాం

గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారని మంత్రి లోకేష్ అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందు

ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి హామీ నిలబెట్టుకుంటాం
గత పాలకులు మీటింగ్ పెడితే పరదాలు, బారికేడ్లు కట్టేవారని మంత్రి లోకేష్ అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సామాన్యుల మాదిరి మీ ముందుకు వచ్చారని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతిహామీ నిలుపుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు అద్భుతంగా పనిచేస్తుండటం వల్లే ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నామని వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నామన్నారు. ఇది మీ అందరి ప్రభుత్వం... మళ్ళీ వస్తాం... మీ పిల్లల భవిష్యత్తు చూసుకునే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Chandrababu Naidu
Narendra Modi
Double Engine Government
Vijayawada
Auto Driver Scheme
Public Welfare
ఆటోడ్రైవర్ సేవ పథకం
సంక్షేమ కార్యక్రమాలు
Scroll for the next article