News29th Dec 12:27 PMSunil Byrisetty1 min read
ప్రభుత్వ స్థలంలోనే ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా పున్నమిఘాట్, భవానీ ఐలాండ్, బెర్మ్ పార్కు, పరిసర ప్రాంతాల్లో ఆవకాయ్ అమరావతోత్సవాలను నిర్వహి
రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా పున్నమిఘాట్, భవానీ ఐలాండ్, బెర్మ్ పార్కు, పరిసర ప్రాంతాల్లో ఆవకాయ్ అమరావతోత్సవాలను నిర్వహించనుంది. ప్రభుత్వ స్థలంలోనే ఈ కార్యక్రమాలు ఉంటాయి. అయితే సందర్శకుల భద్రత దృష్ట్యా మాత్రమే ఎగ్జిబిషన్ అనుమతులను తాత్కాలికంగా నియమ నిబంధనలకు అనుగుణంగా రద్దు చేయడం జరిగింది. వదంతులు నమ్మవద్దు. ఆవకాయ్ అమరావతోత్సవాల నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ తదితరాల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సందర్శకులకు ఇబ్బందికలగకుండా అనుమతి లేని రేకులతో ఉన్న కొన్నింటిని మాత్రమే ఖాళీ చేయమని నిర్వాహకులను కోరామని వివరించారు.