News22nd Dec 04:13 PMSunil Byrisetty1 min read

ఆవకాయ ఒక అద్భుతం

తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆ

ఆవకాయ ఒక అద్భుతం
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 8-10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్ లో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఈ వేడుక ద్వారా ఒకే బహిరంగ వేదికపైకి తేనున్నామని తెలిపారు. ఏపీని సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్, లిటరేచర్ ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో ఈ ఉత్సవం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు.
Andhra Pradesh Tourism
Avakaya festival
Amaravati Festival
Minister Kandula Durgesh
Telugu cinema
Telugu literature
arts and culture
Vijayawada Punnami Ghat
టీమ్‌వర్క్ ఆర్ట్స్
సాంస్కృతిక ఉత్సవం
సినిమా ఉత్సవం
సాహిత్యోత్సవం
Scroll for the next article