News21st Jun 03:38 PMSunil Byrisetty1 min read
పవన్ కృషితో ఏఐఐబీ రోడ్లకు మోక్షం
టీడీపీ ప్రభుత్వంలో ఏఐఐబీ ద్వారా మంజూరు చేసిన రోడ్లను వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా నిలిపివేస్తే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి మంజూరు చేశారని అవనిగడ్డ నియోజకవర
టీడీపీ ప్రభుత్వంలో ఏఐఐబీ ద్వారా మంజూరు చేసిన రోడ్లను వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా నిలిపివేస్తే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి మంజూరు చేశారని అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ - గ్రామీణ అభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు (ఏ.పీ.ఆర్.ఆర్.పీ), ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా రోడ్ల నిర్మాణం చేపడితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా రోడ్ల నిర్మాణ పనులను అర్ధంతరంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో సమావేశం నిర్వహించి పనులు పునః ప్రారంభించేందుకు కృషి చేశారని తెలిపారు. తద్వారా అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.26 కోట్ల 41లక్షలతో పలు రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయా గ్రామాల ప్రజల తరపున ధన్యవాదములు తెలిపారు.