News5th Nov 02:45 PMSunil Byrisetty1 min read
మరో ఎయిర్పోర్ట్ రెడీ.. కేంద్ర మంత్రి ప్రకటన
ఏపిలో కొత్త విమానాశ్రయం సిద్ధమవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం అయ్యాయి. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించి, ఉత్తర
ఏపిలో కొత్త విమానాశ్రయం సిద్ధమవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం అయ్యాయి. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించి, ఉత్తరాంధ్రకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంత అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయం పూర్తయితే, ఈ ప్రాంతంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా ఇది ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఒక పెద్ద సవాలుగా స్వీకరించారన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, అనుకున్న సమయానికి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. 2026 జూన్ నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు.