News12th Jan 03:46 PMSunil Byrisetty1 min read

అమరావతిపై అనవసర వివాదాలొద్దు

అమరావతి రాజధానిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉందని.. రాష్ట్రానికి గుండెలా పనిచేస్తుందని చెప్పారు. అయితే కొందరు అనవసరంగా వి

అమరావతిపై అనవసర వివాదాలొద్దు
అమరావతి రాజధానిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉందని.. రాష్ట్రానికి గుండెలా పనిచేస్తుందని చెప్పారు. అయితే కొందరు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, అది తగదని హితవు పలికారు. అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దని అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని.. అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమరావతిని రాజధానిగా గుర్తించి, అక్కడ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాయని చెప్పారు. అమరావతి అంటే కేవలం ఒక చిన్న గ్రామం కాదని.. విజయవాడ, గుంటూరు, గన్నవరం, మంగళగిరి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిసి ఒక పెద్ద నగరంగా మారనుందని తెలిపారు.
Amaravati Capital
Venkaiah Naidu
Andhra Pradesh Capital
Political Statements
AP Development
కేంద్ర రాష్ట్ర సమన్వయం
విజయవాడ
గుంటూరు
మంగళగిరి
గన్నవరం
Scroll for the next article