News18th Jan 03:24 PMSunil Byrisetty1 min read

ఆరోగ్య‌శాఖ‌లోనూ 'అవేర్' సేవ‌లు

రాష్ట్రంలో సీజిన‌ల్ డిసీజెస్‌ను రియ‌ల్ టైమ్‌లో ప‌ర్య‌వేక్షించి వ్యాధులు వాప్తి చెందకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) లోని అవేర్ విభాగం సేవ

ఆరోగ్య‌శాఖ‌లోనూ 'అవేర్' సేవ‌లు
రాష్ట్రంలో సీజిన‌ల్ డిసీజెస్‌ను రియ‌ల్ టైమ్‌లో ప‌ర్య‌వేక్షించి వ్యాధులు వాప్తి చెందకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) లోని అవేర్ విభాగం సేవ‌ల‌ను వినియోగించుకోనున్న‌ట్లు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. రాష్ట్రంలో వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా సాంకేతిక‌త‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకునే దిశ‌గా వైద్య‌, ఆరోగ్య‌శాఖ అడుగులు వేస్తోంద‌ని చెప్పారు. ఇందుకోసం ఆర్టీజీఎస్‌లోని అవేర్ (అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజ‌రీ ఫ‌ర్‌ రిసిలియెంట్ ఎకోసిస్ట‌మ్) ద్వారా రాష్ట్రంలో వ్యాధుల తీవ్ర‌త‌, వ్యాప్తికి ఉన్నఅవ‌కాశాల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించి వాటిని స‌త్వ‌రం నివారించే దిశ‌గా త్వరలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. గ‌త ఐదారు సంవత్సరా ల్లో (హిస్టారికల్ డేటా) గ్రామాలు, స‌చివాయాల‌యాల వారీగా అంటువ్యాధులు (డెంగీ, మలేరియా,టైఫాయిడ్, ఇతర) కేసెస్ డేటా ఆధారంగా విశ్లేషిస్తారు. అలాగే వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా వ్యాప్తి చెందే సీజన‌ల్ డిసీజెస్ కు సంబంధించి ముంద‌స్తుగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, చ‌ర్య‌ల‌కు ఆర్టీజీఎస్‌లోని సాంకేతిక స‌దుపాయాల‌ను వినియోగించుకోనున్నారు. ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నే దానిపై డైరెక్ట‌ర్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్, డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అధికారుల‌కు అవ‌గాహ‌న కలిపించారు.
Health Department
AWARE Services
RTGS
Real Time Governance Society
Seasonal Diseases
Disease Surveillance
Dengue
సాంకేతికత వినియోగం
మంత్రి సత్యకుమార్ యాదవ్
ముందస్తు హెచ్చరిక వ్యవస్థ
Scroll for the next article