News5th Oct 01:07 PMSunil Byrisetty1 min read
సెలూన్, స్పాల్లో జీఎస్టీపై అవగాహన
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సెలూన్, స్పా తదితర వాణిజ్య కార్యకలాపాలు గల కేంద్రాల్లో సోమవారం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా సెలూన్, స్పా తదితర వాణిజ్య కార్యకలాపాలు గల కేంద్రాల్లో సోమవారం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ఆదివారం సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఈ నెల 7,8 తేదీలలో జిల్లాలో గల పాఠశాలలు, కళాశాలలు తదితర అన్ని విద్యాసంస్థలలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యాసంస్థల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. ఇందుకుగాను వివిధ అంశాలను ఇతివృత్తంగా తీసుకోవాలని చెప్పారు.