News17th Dec 05:41 PMSunil Byrisetty1 min read
పోష్ చట్టంపై ప్రతి ఒక్క విద్యార్ధినికి అవగాహన అవసరం
లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు చట్టాలపై అవగాహన అత్యంత కీలకం, భయం వల్ల మౌనం పాటించకుండా ధైర్యంగా ముందుకు రావాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ పిలుపునిచ్చారు.
లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు చట్టాలపై అవగాహన అత్యంత కీలకం, భయం వల్ల మౌనం పాటించకుండా ధైర్యంగా ముందుకు రావాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల ఐఐఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పోష్, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లైంగిక వేధింపులు అనేవి కేవలం శారీరకమే కాకుండా, మాటలు, సంకేతాలు, అసభ్య వ్యాఖ్యలు, మెసేజ్‌లు, సోషల్ మీడియా ద్వారా కూడా జరుగుతాయని విద్యార్థులకు వివరించారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు 2013లో POSH చట్టం అమలులోకి వచ్చింది, ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు తప్పనిసరి. కమిటీలు బలంగా పనిచేస్తేనే భయరహిత వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళపై ఒత్తిడి, బెదిరింపులు, ప్రతీకార చర్యలు తీసుకోవడం చట్టరీత్యా నేరమని, మహిళా కమిషన్ ఫిర్యాదుదారుల గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, విద్యార్థులు అవగాహన పొందేలా సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు.