Politics12th Aug 11:51 AMSunil Byrisetty1 min read
అసెంబ్లీకి రా జగన్.. స్పీకర్ సూచన!
ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీట్లకు కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సీట్లో ఉంటేనే ఎమ్మెల్యే హాజరైనట్టు పరిగణిస్తామని పేర్కొన్నారు.
డీఎస్సీపై వివాదం చేయడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‍పై ఈ నెల 17న అఖిలపక్ష భేటీలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.