Spiritual25th Aug 09:03 AMSunil Byrisetty1 min read

అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ గౌరవాధ్యక్షునిగా సీతారాం

అయ్యప్పస్వామి ధర్మ ప్రచారం నిర్వహించే ధర్మ ప్రచార సభ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ గౌరవాధ్యక్షునిగా సీతారాం గురుస్వామిని ఎన్నుకున్నారు. విజయవాడ ర

అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ గౌరవాధ్యక్షునిగా సీతారాం
అయ్యప్పస్వామి ధర్మ ప్రచారం నిర్వహించే ధర్మ ప్రచార సభ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ గౌరవాధ్యక్షునిగా సీతారాం గురుస్వామిని ఎన్నుకున్నారు. విజయవాడ రాజరాజేశ్వరి పేటలో జరిగిన అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా కొల్లి సీతారాం గురుస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగార్జున రాజ్ గురు స్వామి, సహాయ కార్యదర్శిగా గాడు గురునాథ్ గురు స్వామి, జోనల్ కార్యదర్శిగా ఇంకొల్లు శ్రీను గురు స్వామి, కార్యవర్గ సభ్యులుగా నరసింహారావు స్వామిని, ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా నియమించిన సభ్యులందరికీ ముఖ్య అతిథులు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ABAP ట్రస్ట్ సభ్యులు లంక బాబు, జాతీయ కార్యదర్శి తాతి నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు శంకరాచారి, కోశాధికారి రాజశేఖర్, పాల్గొన్నారు.
Spiritual Organizations
Ayyappa Dharma Prachara Sabha
All India Ayyappa Sabha
Dharma Prachara
Ayyappa Devotees
ఆంధ్రప్రదేశ్ ధార్మిక కార్యక్రమాలు
అయ్యప్పస్వామి
హిందూ ధర్మం
సభ ఎన్నికలు
Scroll for the next article