Spiritual31st Oct 11:17 AMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ సహకారంతో మంగళగిరిలో 4న అయ్యప్ప పడిపూజ

మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని నవంబర్ 4వ తేదీన అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆ పడిపూజ ఏర్పాట్లకు సంబంధించి శ్రీలక

మంత్రి లోకేష్ సహకారంతో మంగళగిరిలో 4న అయ్యప్ప పడిపూజ
మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని నవంబర్ 4వ తేదీన అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆ పడిపూజ ఏర్పాట్లకు సంబంధించి శ్రీలక్ష్మినరసింహస్వామి దేవస్థానం ఆవరణలో నియోజకవర్గంలో ఉన్న గురుస్వాములతో నిర్వహకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. పడిపూజ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా గురుస్వాములు, నిర్వహకులు మాట్లాడుతూ నవంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్న పడిపూజ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. శ్రీమధు నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక మండపంలో అయ్యప్ప స్వామికి అలంకరణ చేసి 18 పడిమెట్లకు కర్పూర దీపాలు వెలిగించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Andhra Pradesh
Mangalagiri
Ayyappa Padipooja
Nara Lokesh
Sri Lakshmi Narasimha Swamy Temple
ఆధ్యాత్మిక వేడుక
అయ్యప్ప స్వామి
అయ్యప్ప పడిపూజ
Scroll for the next article