Politics5th Apr 01:37 PMSunil Byrisetty1 min read
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రాం జయంతి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రాం జయంతి ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రాం చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించార
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రాం జయంతి ఘనంగా నిర్వహించారు.
జగ్జీవన్ రాం చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆమె మాట్లాడుతూ జగ్జీవన్ స్వతంత్ర సమర యోధులే కాకుండా గొప్ప రాజ నీతిజ్నుడని కొనియాడారు.
అట్టడుగు ఉన్న వారి అభ్యున్నత అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
NDA ప్రభుత్వం ఎస్సీ కులస్థుల అభ్యున్నత ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
మహిళలకి ఇళ్ళు కేటాయించటమే కాకుండా స్కాలర్ షిప్స్ స్కీమ్స్ ప్రవేశ పెట్టారని తెలిపారు.
స్టార్టప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా రెండు ప్రతిష్టత్మక కార్యక్రమాలు ప్రధాని మోదీ తీసుకొచ్చారని వివరించారు.
వెనుకబడిన కులస్థులకి చేయూత అందించే విధంగా ఈ కార్యక్రమం మోదీ ప్రవేశ పెట్టారని తెలిపారు.
జగ్జీవన్ రాం ఏవిధంగా అట్టడుగు ఉన్న కులాలు అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారో అదే విధంగా బీజేపీ సేవా మార్గంలో ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం,మాదల రమేష్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.