Politics3rd Oct 03:33 PMSunil Byrisetty1 min read

నన్ను సరే.. బొత్సను కూడా సస్పెండ్ చేస్తారా?

ఉత్తరాంధ్రలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్

నన్ను సరే.. బొత్సను కూడా సస్పెండ్ చేస్తారా?
ఉత్తరాంధ్రలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో తనను సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆత్మగౌరవం లేని చోట తాను, తన అనుచరులు ఒక్కక్షణం కూడా కొనసాగలేమని అప్పలనాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీలా కాకుండా, వైఎస్ జగన్ చేతుల్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గా మారిపోయిందన్నారు. మజ్జి శ్రీనివాసరావు తనకు బావ అని, ఆయన టీడీపీలోకి వెళ్లారని తనను సస్పెండ్ చేశారని అన్నారు. మజ్జి శ్రీను తనకు మాత్రమే కాదు, బొత్స సత్యనారాయణకు కూడా మేనల్లుడు అవుతారని, మరి బొత్సను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.
Scroll for the next article