News30th Oct 12:13 PMSunil Byrisetty1 min read

తగ్గుముఖం పడుతున్న బహుదా వరద

శ్రీకాకుళం, ఒడిశా జిల్లాల్లో ప్రవహించే బహుదా నది వరద తగ్గుముఖం పట్టగా, నాగావళిలో ప్రవాహం స్వల్పంగా పెరిగింది. గురువారం నాగావళి నదిలో 40,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, శుక్రవార

తగ్గుముఖం పడుతున్న బహుదా వరద
శ్రీకాకుళం, ఒడిశా జిల్లాల్లో ప్రవహించే బహుదా నది వరద తగ్గుముఖం పట్టగా, నాగావళిలో ప్రవాహం స్వల్పంగా పెరిగింది. గురువారం నాగావళి నదిలో 40,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 గంటల నాటికి తోటపల్లి నారాయణపురం ఆనకట్ట వద్ద 47,900 క్యూసెక్కులకు, శ్రీకాకుళం పాత వంతెన వద్ద 48,500 క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగింది. అయితే ఇది ప్రమాద హెచ్చరిక స్థాయి కంటే తక్కువేనని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వంశధార నదిలో గొట్టా బ్యారేజీ వద్ద వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 77,457 క్యూసెక్కుల వరద వస్తుండటంతో కుడి, ఎడమ కాలువలు మూసివేసి.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. దీంతో నిన్నటి నుంచి వంశధారలో అమలులో ఉన్న మొదటి ప్రమాద హెచ్చరిక శుక్రవారం కూడా కొనసాగుతోంది.
Scroll for the next article