News9th Sep 09:07 AMSunil Byrisetty1 min read

బాలయ్య ఖాతాలో మరో రికార్డు!

హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ముంబయిలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను బాలయ్య మోగించారు. తద్వారా ఈ ఘనత వహించిన ఫస

బాలయ్య ఖాతాలో మరో రికార్డు!
హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ముంబయిలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను బాలయ్య మోగించారు. తద్వారా ఈ ఘనత వహించిన ఫస్ట్ సౌత్ యాక్టర్‌గా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు బాలకృష్ణ ఎన్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్‌ఈ గంటను మోగించారు. ఆ తర్వాత బుల్‌తో కలిసి ఫోటోలు దిగారు.కొన్ని రోజుల క్రితం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్‌ఎస్‌ఈ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా బాలకృష్ణ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది.
Andhra Pradesh
Balakrishna
Nandamuri Balakrishna
Hindupur MLA
Telugu Actor
NSE Bell
National Stock Exchange
Mumbai
South Indian Actor
World Book of Records
దక్షిణాది నటుడు
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
Scroll for the next article