Telangana12th Oct 10:34 AMSunil Byrisetty1 min read

రోడ్డు కోసం ఇంటినే ఇచ్చేసిన బాలయ్య

బాలయ్య మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారుల విస్తరణ పనులకు నందమూరి బాలకృష్ణ తన స్వగృహంలోని దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు.

రోడ్డు కోసం ఇంటినే ఇచ్చేసిన బాలయ్య
బాలయ్య మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారుల విస్తరణ పనులకు నందమూరి బాలకృష్ణ తన స్వగృహంలోని దాదాపు 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందు కోసం నగదు రూపంలో ఎలాంటి నష్టపరిహారం తీసుకోవడం లేదు. కొంతమంది ప్రముఖులు తమ ఆస్తులు పోతాయనే నెపంతో అభివృద్ధి ప్రాజెక్టులను, ఫ్లైఓవర్ పనులను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ మాత్రం సంకోచించకుండా తన నివాస స్థలాన్ని త్యాగం చేశారు. ఈ ఇంటిని బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ 1982లో నియమించారు. ఈ ఇంట్లోనే ఎన్టీఆర్ ఎన్నో కీలక సమావేశాలు నిర్వహించారు. జూబ్లిహిల్స్‌లోనే బాలకృష్ణ మరో ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో అక్కడికి మారిపోయే అవకాశం ఉంది.
Scroll for the next article