Politics25th Aug 12:22 PMSunil Byrisetty1 min read
చంద్రబాబు అరెస్టైతే బళ్ళారి తెలుగువారు నిలబడ్డారు
బళ్ళారి మండలం కుడితినిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు తెలుగు ప్రజానీకం, యువత, టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో గజమాలతో మంత్రిని సత్కరించారు."దశా
బళ్ళారి మండలం కుడితినిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు తెలుగు ప్రజానీకం, యువత, టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో గజమాలతో మంత్రిని సత్కరించారు."దశాబ్దాల క్రితం ఉపాధి కోసం బళ్ళారికి వచ్చి స్థిరపడినా... మీ హృదయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎప్పటికీ పదిలమే. ఇక్కడ ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ, మీ మనసంతా నిరంతరం మన రాష్ట్ర శ్రేయస్సు పైనే ఉంటుంది. నాడు ఆత్మగౌరవ నినాదంతో, తెలుగుజాతి ఐక్యత, ఉన్నతి కోసం నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం. ఆనాడు ఉత్తరాఖండ్ విపత్తులో చిక్కుకున్న మనవారిని కాపాడేందుకు స్వయంగా చంద్రబాబు గారే రెస్క్యూ బృందంతో వెళ్లారు. అన్ని రంగాల్లోనూ తెలుగువారు నంబర్-1గా నిలవాలన్నదే మన అందరి లక్ష్యం. బళ్ళారిలో నివసిస్తూ కూడా ఐక్యతతో మెలుగుతూ, ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న మీ కృషి అభినందనీయం" అని అన్నారు.