Politics28th Oct 12:06 PMSunil Byrisetty1 min read

నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభం

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి బ్యాలెట్ కాగితాల ముద్రణ ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం 31 జడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయ

నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభం
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి బ్యాలెట్ కాగితాల ముద్రణ ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం 31 జడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుత్తి, పామిడి, గుంతకల్లు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా స్థానాలకు జడ్పీటీసీ బ్యాలెట్ కాగితాల అవసరం ఉండదు. తెల్లరంగు బ్యాలెట్ కాగితాలు జడ్పీటీసీ అభ్యర్థులకు, పింక్ కలర్ బ్యాలెట్ కాగితాలు ఎంపీటీసీ అభ్యర్థులకు వినియోగిస్తారు. మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గుర్తులు, పేర్లు ముద్రిస్తారు. అనంతపురంలోనే ఈ బ్యాలెట్ కాగితాలు ముద్రించడానికి ఏర్పాట్లు చేశారు. రెండురోజుల్లో ఈ బ్యాలెట్ కాగితాల ముద్రణ పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు.
Scroll for the next article