News18th Sep 03:29 PMSunil Byrisetty1 min read
ముస్లిం సోదరుల చిరకాల స్వప్నం సాకారం..
ముస్లిం సోదరుల చిరకాల స్వప్నం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృషితో సాకారమైంది. బనగానపల్లె పట్టణంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన షాదీఖానా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 20న
ముస్లిం సోదరుల చిరకాల స్వప్నం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కృషితో సాకారమైంది. బనగానపల్లె పట్టణంలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన షాదీఖానా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 20న భవనాన్ని ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు. ముస్లింలు తమ కుటుంబాల్లో జరిగే వివాహాలు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలను గౌరవప్రదంగా, సౌకర్యవంతంగా నిర్వహించుకునేలా షాదీఖానాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు 2018లో బీసీ జనార్దన్ రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలను ఒప్పించి షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. బీసీ జనార్దన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రాజకీయ కక్షతో పనులు నిలిపివేశారు. 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సాధించిన బీసీ జనార్దన్ రెడ్డి, ముస్లిం సోదరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా షాదీఖానా నిర్మాణ పనులను తిరిగి పునః ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.కోటికి అదనంగా తన సొంత నిధులు రూ.1.60 కోట్లు వెచ్చించి నిర్మాణ పనులను పూర్తి చేయించారు. మొత్తం రూ.2.60 కోట్లతో షాదీఖానాను ఆధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దారు.