Health14th Apr 09:31 AMSunil Byrisetty1 min read

అరటి ఆకు సాంప్రదాయమేంటో తెలుసా.?

అరటి ఆకులో భోజనం అంటే ఇష్టపడని వాళ్లెవరు? ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడిపోవడంతో అరటి ఆకు దూరమైపోతోంది. అయినప్పటికీ అరటి ఆకులో భోజనం చేసే అవకాశం వస్తే కాదనే వారుండరు. ఇప్పుడంటే

అరటి ఆకు సాంప్రదాయమేంటో తెలుసా.?
అరటి ఆకులో భోజనం అంటే ఇష్టపడని వాళ్లెవరు? ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడిపోవడంతో అరటి ఆకు దూరమైపోతోంది. అయినప్పటికీ అరటి ఆకులో భోజనం చేసే అవకాశం వస్తే కాదనే వారుండరు. ఇప్పుడంటే అరటటి ఆకులకు బదులు ఈ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. కానీ అరటి ఆకు వెనుక సాంప్రదాయం కూడా ఉంది. అరటి ఆకులో అన్నం వడ్డించే ముందు మొదట అరటి ఆకుపై నీటిని చల్లడం ఆచారం. దీనికి వివిధ కారణాలున్నాయి. అరటి ఆకులపై సహజంగా కీటకాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. నీటిని చల్లి శుభ్రం చేయడం వలన ఆకు మీద ఉన్న కీటకాలు, సూక్ష్మజీవులు తొలగించబడతాయి. అప్పుడు ఆకులో ఆహారాన్ని వడ్డించుకుని తినడం వలన భద్రత ఉంటుందని నమ్మకం. ఆకులలో భోజనం తిన్న తర్వాత, దానిని లోపలికి మడత పెడతారు. ఇలా చేయడం ఆహారాన్ని తయారు చేసి వడ్డించిన వారికి గౌరవం చూపించే మార్గంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు ఆహార అవశేషాలు ఆకు లోపల భాగంలో ఉంటాయి. అందువల్ల, బయట నుంచి ఆకును లోపలికి మడత పెట్టడం సులభమవుతుంది.
banana
banana leaf food
eating
culture tradition
అరటి ఆకులో భోజనం
Scroll for the next article