News8th Jun 03:13 PMSunil Byrisetty1 min read
జెంటిల్ మెన్‌కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ
జెంటిల్ మెన్‌కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ అని సీఎం చంద్రబాబు అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు రచించిన ’ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి
జెంటిల్ మెన్‌కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ అని సీఎం చంద్రబాబు అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు రచించిన ’ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారన్నారు. దత్తాత్రేయది పేరుకు హిందుత్వం, మతం భారతీయమని పేర్కొన్నారు. దత్తాత్రేయ కోరుకుంది జనహితం... ఆయనది లౌకికవాదమని అన్నారు. దత్తాత్రేయకు విరోధులు ఎవరూ ఉండరు.. దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదని, ఆయనది ఆదర్శ రాజకీయ జీవితమని కొనియాడారు.