Telangana6th Sep 12:08 PMSunil Byrisetty1 min read
వినాయకుడి లడ్డూ రూ.2.31 కోట్లు.. ఎక్కడంటే?
వినాయక వేడుకల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది గణేష్ లడ్డూ. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం పాట వేస్తుంటారు నిర్వాహకులు. గణేశుడి లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. అందులో భాగంగా
వినాయక వేడుకల్లో అత్యంత ప్రాధాన్యత కలిగింది గణేష్ లడ్డూ. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం పాట వేస్తుంటారు నిర్వాహకులు. గణేశుడి లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. అందులో భాగంగా చాలా ప్రాంతాల్లో లడ్డూ వేలంపాటలు కొనసాగుతున్నాయి. వేలంలో గణేష్ లడ్డూ లక్షల రూపాయలు పలుకుతున్నాయి. కాగా రంగారెడ్డి జిల్లాలో వినాయకుడి లడ్డూ సరికొత్త రికార్డును సృష్టించింది. గండిపేట మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట గతేడాది రికార్డును బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 2 కోట్ల 31 లక్షలు పలికింది. గతేడాది గణపతి లడ్డూ ధర 1. 87 కోట్ల రూపాయిలు పలకగా, ఈ ఏడాది ఆ రికార్డ్ బ్రేకయింది.