Sports5th Jan 01:10 PMSunil Byrisetty1 min read
టీ20లో మేం ఆడం.. బంగ్లా యూటర్న్
మరో నెల తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్ సమయంలో బంగ్లాదేశ్ అతి వ్యాఖ్యలకు దిగింది. భారత్ ఆతిథ్యమిస్తున్న వేళ, తమ మ్యాచ్‌లను ఇక్కడ ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చిచెప్పిం
మరో నెల తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్ సమయంలో బంగ్లాదేశ్ అతి వ్యాఖ్యలకు దిగింది. భారత్ ఆతిథ్యమిస్తున్న వేళ, తమ మ్యాచ్‌లను ఇక్కడ ఆడేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చిచెప్పింది. తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో టోర్నమెంట్ నిర్వహణ గందరగోళంలో పడింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవల దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఆరోపణలకు దిగింది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమ దేశ క్రికెటర్‌ను అవమానించిన చోట, తమ జాతీయ జట్టు ప్రపంచకప్ ఎలా ఆడుతుందని ప్రశ్నించింది.