Spiritual22nd Oct 02:59 PMSunil Byrisetty1 min read
దుర్గ గుడిలో రేపు గాజుల అలంకరణ
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించనున్నారు. అందుకోసం ఈవో శీనా నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో గాజుల అలంకరణకు సర్వం సిద్ధం చేశారు. కార్తీక మా
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించనున్నారు. అందుకోసం ఈవో శీనా నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో గాజుల అలంకరణకు సర్వం సిద్ధం చేశారు. కార్తీక మాసం తొలిరోజు బుధవారం అమ్మవారి ఆలయంలో దాతలు ఇచ్చిన గాజులకు
భక్తిశ్రద్ధలతో ఈవో శీనా నాయక్ దంపతులు పూజలు చేశారు. గురువారం అమ్మవారి ఆలయంలో “గాజుల ఉత్సవం”, భగినీ హస్త భోజనం (యమ ద్వితీయ) సందర్భంగా గాజుల అలంకరణ ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.