Crime11th Aug 11:20 AMSunil Byrisetty1 min read
హైదరాబాద్‌లో ఇంద్ర సినిమా తరహా మోసం
బంజరాహిల్స్‌లో ఇంద్ర సినిమా తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మూలికల భస్మంతో బంగారం చేస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. నకిలీ స్వామిజీలు నెల రోజులపాటు పూజలు చేశారు. మూట ఇచ్చి వారం తర్వాత
బంజరాహిల్స్‌లో ఇంద్ర సినిమా తరహా మోసం వెలుగులోకి వచ్చింది. మూలికల భస్మంతో బంగారం చేస్తామంటూ మోసానికి పాల్పడ్డారు. నకిలీ స్వామిజీలు నెల రోజులపాటు పూజలు చేశారు. మూట ఇచ్చి వారం తర్వాత తెరవాలన్న మోసగాళ్ళు.. అనుమానంతో ముందే మూట తెరిచిన వ్యాపారి అవాక్కయ్యాడు. మూటలో ఇనుప ముక్కలు చూసి వ్యాపారి షాక్.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు కాజేసిన దుండగులు.. ముగ్గురు అరెస్ట్, పరారీలో మరో నిందితుడు ఉన్నట్లు చెబుతున్నారు. స్వామిజీ వేషాలతో వచ్చి టోకరా వేస్తున్న కేటుగాళ్లు.. బంగారమంటూ మూటకట్టి వారం తర్వాత తెరవాలని మోసాలకు తెగబడుతున్నారు.