News23rd Sep 12:04 PMSunil Byrisetty1 min read

బ్యాంకు సంఘాల దేశవ్యాప్త సమ్మె

దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, యున

బ్యాంకు సంఘాల దేశవ్యాప్త సమ్మె
దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సమ్మెకు పిలుపునిచ్చింది. ఫలితంగా సెప్టెంబర్ చివరి వారంలో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు సంఘాలు కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌తో జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. సమ్మెకు ముందు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉన్నాయి. దీంతో మొత్తం ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
Scroll for the next article