Politics26th May 05:49 PMSunil Byrisetty1 min read

ఏపీలో పరాకాష్టకు కక్షారాజకీయాలు

రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార

ఏపీలో పరాకాష్టకు కక్షారాజకీయాలు
రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల, నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక, పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి, పొగాకు కొనుగోళ్ళు జరిపించే వరకు రైతులతో కలిసి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. మెట్టప్రాంతంలో పొగాకు కొనుగోళ్ళు లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. నేరుగా రోడ్లమీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు.
ANDHRA pradesh
AP Politics
YSRCP
Minister Dr. Merugu Nagarjuna
formers
తెల్ల
నల్లబర్లీ పొగాకు
రైతులు
Scroll for the next article