News4th May 10:37 AMSunil Byrisetty1 min read
ఫలించిన ఎంపీ కృషి.. భారీగా నిధులు!
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కృషి ఫలించింది. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి కృషితో ప్రజల ఇక్కట్లు తొలగించడానికి వేమూరు నియోజకవర్గంలో ఐదు రైల్వే క్రాసింగ్
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కృషి ఫలించింది.
బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి కృషితో ప్రజల ఇక్కట్లు తొలగించడానికి వేమూరు నియోజకవర్గంలో ఐదు రైల్వే క్రాసింగ్ లైన్ల వద్ద ఆర్వోబీల నిర్మాణాలకు దాదాపు 261 కోట్ల రూపాయల మంజూరయ్యాయి.
ఆర్వోబీలు లేక రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు తరచుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
వాటిని నివారించేందుకు ఎంపీ కృష్ణ ప్రసాద్ కృషి చేశారు.
ఆర్వోబీల మంజూరు కు సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లకు నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు.