Telangana19th Oct 05:26 PMSunil Byrisetty1 min read
ప్రకృతి పండుగ.. బతుకమ్మ
ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలందరూ అత్యంత వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ప్రకృ
ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలందరూ అత్యంత వైభవంగా నిర్వహించుకునే బతుకమ్మ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ప్రకృతి రక్షణ. చేన్లలో, చెరువు గట్టుల మీద లభించే తీరక్క పూలను సేకరించి బతుకమ్మను అమర్చుతారు, చెరువులను, చేన్లను కాపాడుకోవాలనే గొప్ప సంకేతం. బతుకమ్మ ఆడటం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఇది ఆరోగ్యాన్ని పరిరక్షించే పండుగ. బతుకమ్మ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని, మానవ సంబంధాల అనుబంధాన్ని, ఆనందాన్ని పంచిపెట్టే గొప్ప వేడుక. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని మన భవిష్యత్ తరాలకు ఘనంగా అందించాలి.