Education25th Jul 03:41 PMSunil Byrisetty1 min read
పీ-4 మోడల్ లో బీసీ హాస్టళ్ల అభివృద్ధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 మోడల్‌లో వెనుకబడిన తరగతుల హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ-4 మోడల్‌లో వెనుకబడిన తరగతుల హాస్టళ్లను అభివృద్ధి చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనిలో భాగంగా దాతలు, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద లబ్ధి పొంది ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థుల సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్వర్ణాంధ్ర @ 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పీ-4 మోడల్ కు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ సహకారంతో ఆర్థికంగా ఉన్నత స్థానాలల్లో ఉన్న వారు తమకు తోచిన రీతిలో వెనుకబడిన తరగతుల హాస్టళ్లలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సాయమందించడానికి ముందుకు రావాలని కోరారు. పీ-4 విధానంలో ప్రజల భాగస్వామ్యంతో హాస్టళ్ల నిర్వహణ మరింత సులభంగా మారుతుందని మంత్రి తెలిపారు.
సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగి, పేద బీసీ విద్యార్థులకు అండగా నిలవాలనుకున్నవారు directorapbcwelfare@gmail.com మెయిల్ కు గాని, 6300876401, 7989344521 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం విద్యార్థులకు మంత్రి సవిత పిలుపునిచ్చారు.