News12th Sep 03:22 PMSunil Byrisetty1 min read
కూటమి ప్రభుత్వంతోనే బీసీల రక్షణ చట్టం
బీసీల రక్షణ చట్టం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వo కట్టుబడి ఉందని కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాష్ట్రంలోని శెట్టి బలిజ సా
బీసీల రక్షణ చట్టం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వo కట్టుబడి ఉందని కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజికవర్గాన్ని ఓసిల్లో చేరుస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని మంత్రి ఖండించారు. శెట్టి బలిజల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని సుభాష్ స్పష్టం చేశారు. బిసిల రక్షణకోసం ప్రత్యేక చట్టం తీసుకు రావాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. బీసీల రక్షణ చట్టంపై ఇప్పటికే పలుమార్లు బిసి మంత్రులు, శాసనసభ్యులతో సమావేశం నిర్వహించామన్నారు. స్ధానిక సంస్ధల్లో బిసిల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిన వైసీపీ నేడు బిసీల పట్ల మొసలీ కన్నీరు కారుస్తోందన్నారు. బిసీలకు అగ్రతాంబూలం ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని, బార్లు, వైన్ షాపుల్లో శెట్టిబలిజలకు 10% అవకాశం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.