Politics10th Oct 12:37 PMSunil Byrisetty1 min read

రిజర్వేషన్లలో టీడీపీని వైసీపీ దాటగలదా?

స్థానిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం ప్రధాన పార్టీలకు అలవాటుగా మారింది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల

రిజర్వేషన్లలో టీడీపీని వైసీపీ దాటగలదా?
స్థానిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం ప్రధాన పార్టీలకు అలవాటుగా మారింది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదన్న రాజ్యాంగపరమైన సత్యం రాజకీయ నాయకులకు, న్యాయ నిపుణులకూ తెలుసు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకమైన జీవోల విన్యాసాలు ప్రదర్శించింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కూడా కోర్టుల పేరుతో అదే కసరత్తు చేసింది. పదేపదే జరుగుతున్న ఈ రాజకీయ నాటకాలను చూసి విసిగిపోయిన బీసీ వర్గాలు కూడా పార్టీల ప్రకటనలను పట్టించుకోవడం మానేశాయి. అయితే, పార్టీ పరంగా ఇచ్చే టికెట్లలో బీసీలకు 34 శాతానికి తగ్గకుండా, అంతకంటే ఎక్కువే స్థానాలను కేటాయించి తీరుతామని చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఇక్కడే అసలైన రాజకీయ పరీక్ష ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీట వేశామని, వారే తమ పార్టీకి వెన్నెముక అని ప్రచారం చేసుకునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు విసిరిన ఈ సవాల్‌ను స్వీకరించగలరా, టికెట్ల పంపకంలో ఆ చిత్తశుద్ధిని చేతల్లో చూపించగలరా లేదా అనేది ఇప్పుడు కేడర్‌లోనే చర్చనీయాంశంగా మారింది.
Scroll for the next article