Politics20th Mar 12:53 PMSunil Byrisetty1 min read

ఆంధ్రాలో చేసినట్లు తెలంగాణలో చేస్తాం

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై బిల్లులు చేసుకోవడం శుభ పరిణామమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్లు చాలా రాష్ట్రాల్లో 50 శాతానిక

ఆంధ్రాలో చేసినట్లు తెలంగాణలో చేస్తాం
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై బిల్లులు చేసుకోవడం శుభ పరిణామమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్లు చాలా రాష్ట్రాల్లో 50 శాతానికి మించి ఉన్నాయి, కాబట్టి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు ఫ్రీ బస్ అనేది గేమ్ ఛేంజర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత మా ప్రభుత్వంలో ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం చేసినట్టుగా, మేం కూడా రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ పెరిగిన తర్వాత కులాల వారీగా జనాభా ప్రకటిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లు ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో అందాల పోటీలు పెట్టకూడదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
Ponnam Prabhakar
Telangana
BC
Scroll for the next article