Politics14th Aug 04:06 PMSunil Byrisetty1 min read
బీసీ రిజర్వేషన్లపై నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు అప్డేట్ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ల ఖరారుకు కీలక అడుగు పడనుంది. రిజర్వేషన్లపై బీసీ రిజర్వేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంద
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు అప్డేట్ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ల ఖరారుకు కీలక అడుగు పడనుంది. రిజర్వేషన్లపై బీసీ రిజర్వేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ ఈ నివేదికను రూపొందించింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కమిషన్ అధ్యయనం చేసింది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నివేదికను పరిశీలించిన అనంతరం రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకోనుంది.