News10th Oct 04:35 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారుపై ప్రత్యేకంగా భేటీ అయిన క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ క్యాబినెట్ రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన

స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారుపై ప్రత్యేకంగా భేటీ అయిన క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ క్యాబినెట్ రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ ఛైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు క్యాబినెట్ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడించారు. పంచాయతీ వార్డు మెంబర్స్ బీసీలకు 26.73 శాతం రిజర్వేషన్లు, సర్పంచ్లలో 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55, ఎంపీపీల్లో 24.60, జడ్పీటీసీలకు 24.60 శాతం, జడ్పీ ఛైర్పర్సన్లకు 23.08 శాతం, అర్బన్ వార్డుమెంబర్లకు 32.78 శాతం మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ ఛైర్పర్సన్లలో 32.03 శాతం, మేయర్లలో 35.02 శాతం మేర రిజర్వేషన్లు ఖరారు చేశారు.
Scroll for the next article