News28th Nov 11:06 AMSunil Byrisetty1 min read

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ స

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహ్మాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారు. అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు చివరి వరకూ రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు అని ప్రశంసించారు. తొలి బాలికలకు పాఠశాల స్థాపించిన విద్యావేత్త జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. ఈ పాఠశాలలో అన్ని కులాలకూ ప్రవేశం కల్పించారన్నారు. వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానీయుడని సవిత కొనియాడారు.
Andhra Pradesh
Jyotirao Phule
Mahatma Phule
BC Welfare Minister Savita
Social Reformer
Women Empowerment
Marginalized Communities
Death Anniversary
Tadepalli Camp Office
మహారాష్ట్ర సంస్కర్త
వితంతు పునర్వివాహం
సామాజిక న్యాయం
పూలే వారసత్వం
Scroll for the next article