Sports25th Apr 12:46 PMSunil Byrisetty1 min read
పాక్‌పై క్రికెట్ బ్యాన్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
పహల్గామ్ ఉగ్ర దాడితో భారత్, పాక్ మధ్య పరిణామాలు విషమించిన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సింధు జలాలు, వాఘా సరిహద్దు మూసివేత, వీసాల రద్దు వంటి నిర్ణయాలు ప్రభుత్వ
పహల్గామ్ ఉగ్ర దాడితో భారత్, పాక్ మధ్య పరిణామాలు విషమించిన నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సింధు జలాలు, వాఘా సరిహద్దు మూసివేత, వీసాల రద్దు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది.
ఈ నేపథ్యంలో పాక్‌తో క్రికెట్ ఆడే విషయంలో బీసీసీఐ నిర్ణయం ప్రకటించింది.
భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని స్పష్టం చేసింది.
ఇక ఎప్పటికీ పాక్‌తో ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఉండవని ప్రకటించింది.
ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికలో ఆడుతున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
2012-2013 మద్య జరిగిన ఇండియా - పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ చివరిది కానుంది.
పహాల్గామ్ ఉగ్రవాదులు దాడి నేపథ్యంలో ఈ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుని పాక్‌ను బహిష్కరించింది.