Telangana2nd Sep 03:56 PMSunil Byrisetty1 min read

నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు

ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, వివరణ ఇచ్చానని చెప్పారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మ

నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు
ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, వివరణ ఇచ్చానని చెప్పారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. తన బిడ్డ మాట్లాడితే తనకు ఎందుకు శిక్ష వేస్తారని ప్రశ్నించారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెపుతున్నారని, కూతురు మాట్లాడిన దానికి తనపై చర్యలు తీసుకోవద్దని అన్నారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. పొంగులేటి, భ‌ట్టి భార్య కమిషన్ల పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని.. దానిపైన ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. సీఎం రేవంత్ పై చాలామంది మంత్రులు, నేతలు అసంతృప్తితో ఉన్నారని తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ‌ వ్యాఖ్యానించారు.
Telangana Congress
Konda Surekha
Konda Surekha News
Telangana Politics
Revanth Reddy
Mallikarjun Kharge
K C Venugopal
Rahul Gandhi
బీసీలు
బీసీ వర్గాలు
తెలంగాణ మంత్రులు
కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ వార్తలు
రాజకీయ వార్తలు
హైదరాబాద్ న్యూస్
Scroll for the next article