News8th Nov 05:05 PMSunil Byrisetty1 min read

"బిసివైపార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్" ప్రకటించిన బోడె రామచంద్రయాదవ్

విద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల వంటి విషాద ఘటనలతో చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నెలకొన్న ఆందోళనకర వాతావరణంపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ స్పందించారు. విద

"బిసివైపార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్" ప్రకటించిన బోడె రామచంద్రయాదవ్
విద్యార్థుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల వంటి విషాద ఘటనలతో చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నెలకొన్న ఆందోళనకర వాతావరణంపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ స్పందించారు. విద్యార్థులకు ధైర్యం చెప్పేందుకు, వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఆయన శనివారం కళాశాలను సందర్శించారు. కళాశాల సందర్శన సందర్భంగా, ఆయన వందలాది మంది విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను, మానసిక ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు బోడె రామచంద్రయాదవ్ ఈ సందర్భంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. దానిపేరే 'బిసివై పార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్, ఇది లైఫ్ లైన్ అనేది కేవలం ఒక హెల్ప్ లైన్ నంబర్ మాత్రమే కాదని, విద్యార్థుల హక్కులను పరిరక్షించే ఒక బలమైన వేదిక అని ఆయన స్పష్టం చేశారు. ర్యాగింగ్, వేధింపులు, అధిక ఫీజులు, కౌన్సిలింగ్ అవసరం, మానసిక ఒత్తిడి, క్యాంపస్ సమస్యలు... ఇలా విద్యార్థులకు సంబంధించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు చెప్పుకోలేని ఏ సమస్య అయినా.. అది ఆత్మహత్యకు ప్రేరేపించేదిగా అనిపిస్తే వెంటనే బిసివై పార్టీ పోర్టల్ https://bcyparty.org/studentlifeline/ లేదా మెయిల్ ఐడి studentlifeline@bcyparty.org లేదా పోన్ నెంబర్ ‪+91 88863 12345‬ ను సంప్రదించవచ్చని భరోసా కల్పించారు.
Andhra Pradesh
BCY Party
Bode Ramachandra Yadav
Student Lifeline
Chittoor
SithaM’s Engineering College
Student Support
Mental Health
Ragging
Counseling
Scroll for the next article