Politics17th Jul 05:49 PMSunil Byrisetty1 min read
బనకచర్లతో ఆంధ్రప్రదేశ్ అంధకారం?
ముడుపుల కోసమే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ జపం చేస్తున్నారని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రావుల పాలెంలో జరిగిన బిసిల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్
ముడుపుల కోసమే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ జపం చేస్తున్నారని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రావుల పాలెంలో జరిగిన బిసిల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ కోసం చంద్రబాబును నాయుడు తెగ వెంపర్లాడుతున్నారన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్రంలో సంక్షేమ పధకాలకు డబ్బులు లేవని చెప్పే చంద్రబాబు.. బనకచర్ల ప్రాజెక్ట్ కు 82 వేల కోట్ల నిధులను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. అలాగే బనచర్ల ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే అనేక చోట్ల లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని, ఆ లిఫ్ట్ ల కోసం 4,100 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ లిఫ్ట్‌ల కోసం అవసరమయ్యే విద్యుత్ ను ఉత్పత్తి చేయాలంటే పోలవరం లాంటి ప్రాజెక్టులు నాలుగు ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. బనకచర్ల పూర్తయితే లిఫ్ట్‌ల కోసం వినియోగించే విద్యుత్ కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తారన్నారు.