News2nd Nov 12:17 PMSunil Byrisetty1 min read
మరో తుపాన్ కి సిద్ధమవ్వండి
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను మురసు సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ ఫార్మ
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను మురసు సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కేబుల్స్, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సిబ్బందిని సిధ్దం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బందిని, యంత్రాలను రప్పించేందుకు సిధ్ధమన్నారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎండీలు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎండీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
రెవెన్యూ, సచివాలయం, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలి మంత్రి ఆదేశాలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలు వీలైనంత వరకు తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.