Spiritual31st Dec 03:41 PMSunil Byrisetty1 min read

భగవంతుడి ముందు భక్తుడా.. వీఐపీనా?

వీఐపీ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కానీ ప్రస్తుత ట్రెండ్‌లో ఆలయంలో దర్శనానికి షార్ట్ కట్‌లో వెళ్లగలిగినవాడే వీఐపీ. ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందు

భగవంతుడి ముందు భక్తుడా.. వీఐపీనా?
వీఐపీ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కానీ ప్రస్తుత ట్రెండ్‌లో ఆలయంలో దర్శనానికి షార్ట్ కట్‌లో వెళ్లగలిగినవాడే వీఐపీ. ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు వీఐపీలంతా క్యూకట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఈ వీఐపీలు తమ ప్రభావం చూపారు. ఎవరి స్థాయికి వారు దేవుడి దగ్గర వీఐపీ తనం చూపించి సామాన్యులంతా లైన్లలో వస్తూంటే.. తాము మాత్రం… అందర్ని దాటుకుని వీఐపీగా వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వచ్చారు. తాము వీఐపీలమని వారనుకుంటారేమో కానీ.. దేవుడికి కాదు. ఇంకా ఇంత మందిని అన్యాయంగా దాటేసి వచ్చినందుకు దేవుడు ఆగ్రహించవచ్చు కూడా. “దేవాలయం అనేది అహంకారాన్ని వదిలేయాల్సిన చోటు. సామాన్య భక్తులతో కలిసి క్యూలో నిలబడి, గంటల తరబడి వేచి ఉండి దర్శించుకున్నప్పుడే భక్తుడిలో ఓర్పు, భక్తి ,వినయం పెరుగుతాయ. లోకంలో ఏ పదవిలో ఉన్నా, ఎంత ధనవంతులమైనా.. భగవంతుని సన్నిధిలో కేవలం ఒక యాచకుడివి లేదా దాసుడివి మాత్రమే” అని బ్రహ్మశ్రీ చాగంటి వారు చెబుతారు. ఇందులో నూరు శాతం వాస్తవం ఉంది. దేవుడి దగ్గరకు వెళ్లాలన్న చట్టం లేదు. అందరూ నమ్మకంతోనే వస్తారు. ఎందుకు వస్తారు?. మరి ఆ విషయం ఎందుకు వీఐపీలు తెలుసుకోలేకపోతున్నారు.
Temple Darshan
VIP Culture
Equality Before God
Mukkoṭi Ekadashi
Tirumala Tirupati Devasthanams
Devotee Ethics
చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు
ఆధ్యాత్మిక విలువలు
Scroll for the next article