News1st Nov 09:03 AMSunil Byrisetty1 min read

ఏపీలో భిక్షమెత్తితే.. అంతే

రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025' అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏప

ఏపీలో భిక్షమెత్తితే.. అంతే
రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025' అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.
Andhra Pradesh
Begging Ban
AP Government
Social Welfare
Law 2025
Anti Begging Act
Rehabilitation
Public Order
Legal Reform
సామాజిక సంక్షేమశాఖ
పోలీసు శాఖ
భిక్షాటన నివారణ చట్టం
Scroll for the next article